Sat Mar 07 2026 23:41:24 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : త్వరలో ఏపీలో ఎన్నికలు... కేబినెట్ నిర్ణయాలివే
సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు

సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సబ్, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2,774 రేషన్ షాపులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎక్సైజ్ పాలసీ పునర్వ్యస్థీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలవరం ఎడమ కాల్వను...
అలాగే పోలవరం ఎడమ కాల్వ పునరుద్ధరణకు కూడా మంత్రి వర్గ సమావేశం ఓకే చెప్పింది. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలని నిర్ణయించింది. 22ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివాదాల విషయంలో రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని మంత్ర వర్గ సమావేశం నిర్ణయించింది.
Next Story

