Thu Jan 22 2026 03:55:44 GMT+0000 (Coordinated Universal Time)
Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నంద్యాలలో జరిగిన ఈఘటన మరోసారి కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని తలపించింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మరణించారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై నిన్న అర్ధరాత్రి ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.
నెల్లూరు నుంచి హైదరాబాద్ కు...
ఏఆర్ బీ సీవీఆర్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళుతుంది. అయితే టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ ను దాటి ఎదురుగా వస్తును్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులున్నారు. అయితే అటుగా వెళుతున్న మరొక డీసీఎం వ్యాన్ డ్రైవర్ వెంటనే అక్కడ ఆపి బస్సు అద్దాలను పగలగొట్టగా అందులో ప్రయాణికులు చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ భాస్కర్ తో పాటు క్లీనర్ కూడా సజీవదహనమయ్యారు. డ్రైవర్ భాస్కర్ ది కడప జిల్లా. బస్సులో ద్విచక్ర వాహనాలు కూడా వేసుకుని బయలుదేరడంతో అవి కూడా పూర్తిగా దగ్దమయ్యాయి.
బస్సు అద్దాలు పగలగొట్టి...
అయితే మంటలు చెలరేగడంతో వెంటనే ప్రయాణికులు బస్సు అద్దాలను పగలకొట్టుకుని బయటపడ్డారు. అయితే ఈ సందర్భంగా అనేక మందికి గాయాలయ్యాయి. గాయాలపాలయిన ప్రయాణికులకును వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స తరలిస్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు బస్సులో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. బస్సు అద్దాలను పగలగొట్టి వారిని బయటకు తెచ్చారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమయింది.
Next Story

