Sat Mar 07 2026 19:50:15 GMT+0530 (India Standard Time)
భవనం కూలి ఇద్దరు మృతి.. శిధిలాల కింద
భారీ వర్షాలకు భవనాలు కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఒక భవనం కూలిపోయింది.

భారీ వర్షాలకు భవనాలు కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఒక భవనం కూలిపోయింది. శిధిలాల కింద పది మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ భవనం కూలి పక్కనే ఉన్న రెండతస్థుల భవనంపై పడింది. ఇందులో పది మంది అద్దెకు ఉంటున్నారు. దీంతో ప్రమాదంలో పలువురు గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
ఇద్దరు చిన్నారులు....
భారీ వర్షాలకు నాని ఈ భవనం కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. శిధిలాల కింద నుంచి నలుగురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story

