Sat Dec 20 2025 13:57:29 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో చేరిన తర్వాతే దశ తిరిగింది
బూడి ముత్యాలనాయుడు వార్డు సభ్యుడి నుంచి ఎదిగారు. వైసీపీ లో చేరిన తర్వాత ఆయన దశ తిరిగింది.

1991 నుంచి యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రవేశం చేసిన బూడి ముత్యాలనాయుడు వార్డు సభ్యుడి నుంచి ఎదిగారు. వైసీపీ లో చేరిన తర్వాత ఆయన దశ తిరిగింది. 2014లో మాడుగల నియోజవకర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన పార్టీలోనే కొనసాగారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడుకు మంత్రి పదవి దక్కటం ఆయన సీనియారిటీని చూసే. జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ఆయనను గౌరవించి జగన్ ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చారు. ఈసారి ఏ శాఖ దక్కుతుందనేది చూడాలి.
Next Story

