Sat Mar 28 2026 16:53:39 GMT+0530 (India Standard Time)
లోకేష్ నేతృత్వంలో నిరసన
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నాటుసారా మృతులపై జ్యుడిషియల్ విచారణ జరపాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేస్తూ మరీ సభలోకి రావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. నాటుసారా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
ర్యాలీగా వెళ్లి.....
అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీని చేపట్టారు. సారామరణాలు సహజమరణాలు కావంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో కల్తీసారా, జే బ్రాండ్ మద్యం కారణంగా అనేక మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకూ నిరసన ర్యాలీ చేపట్టింది.
- Tags
- nara lokesh
- tdp
Next Story

