Fri Dec 05 2025 18:37:41 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత వెంకన్న ఇలా అనేశారేంటో?
తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తన స్వరం మార్చాడు. పార్టీ అధికారంలోకి వచ్చినా తాను ఏం చేయలేక పోతు న్నానన్నారు

తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తన స్వరం మార్చాడు. పార్టీ అధికారంలోకి వచ్చినా తాను ఏం చేయలేకపోతున్నానన్నారు. కనీసం విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో తన మాట నెగ్గలేదని ఆయన వాపోయారు. ఎమ్మెల్యేల మాటకే విలువ ఇచ్చారంటూ ఆయన ఆవేదన చెందారు. తనకు ఏ పదవి లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందన్న వెంకన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై 37 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
టిక్కెట్ దక్కకపోయినా...
గత ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా పార్టీ విజయం కోసం పనిచేశానని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వారికి న్యాయం చేయలేకపోతున్నానన్న బాధ తనలో ఉందన్నారు. అయితే నాయకత్వంపై తాను వ్యతిరేకతతో అంటున్న మాటలు కాదని, ఆవేదనతో అంటున్నానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఇంకా లీడర్ గా ఉండటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పై జోగి రమేష్ దాడిచేసినప్పుడు తాను ఒక్కడినే ఎదుర్కొన్నానని, కానీ అప్పుడు ఏ నేత రాలేదన్న విషయం ఆయన గుర్తు చేశారు.
Next Story

