Sun Mar 15 2026 06:29:24 GMT+0530 (India Standard Time)
తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
పులివెందుల అభ్యర్థిగా బీటెక్ రవి పేరును ఖారారు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.

పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవి పేరును ఖారారు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు అభ్యర్థివని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేతల అభిప్రాయాలను తీసుకుని, సమావేశంలోనే బీటెక్ రవిని పులివెందుల టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.
పులివెందుల నుంచి.....
అయితే గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన ఏ పార్టీలో లేకపోయనా చంద్రబాబు పులివెందుల అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం. ఎన్నికలకు రెండేళ్ల ముందే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థి బీటెక్ రవి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆయన పోటీ పడాల్సి ఉంటుంది.
Next Story

