Sun Mar 22 2026 01:40:40 GMT+0530 (India Standard Time)
విశాఖకు కేసీఆర్ ఎందుకంటే?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే విశాఖపట్నానికి రానున్నారని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే విశాఖపట్నానికి రానున్నారని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. ఏపీలోని విశాఖలో తొలి బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
తొలి సభను...
అనేక మంది నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ లో ఏపీ నుంచి పెద్ద యెత్తున చేరికలు ఉంటాయన్నారు. విశాఖ సభ తేదీలను కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్నారని ఆయన చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
- Tags
- kcr
- visakhapatnam
Next Story

