Thu Dec 18 2025 04:54:39 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవితో తోట భేటీ.. అందుకేనట
కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమాశమయ్యారు

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమాశమయ్యారు. తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరతారని సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో...
ఈ నేపథ్యంలో చిరంజీవితో భేటీ ఆసక్తికరంగా మారింది. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో తోట చంద్రశేఖర్ చేరనున్నారని తెలిసింది. ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా విడదల రజని నియమించడంతో తాను పోటీ చేయాలని తోట చంద్రశేఖర్ అనుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ ఆయనకు ఆ అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

