Wed Dec 17 2025 08:42:46 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పకూలిన వంతెన
శ్రీకాకుళం జిల్లాలో పురాతన వంతెన కుప్ప కూలింది. ఇచ్ఛాపురం సమీపంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కూలింది.

శ్రీకాకుళం జిల్లాలో పురాతన వంతెన కుప్ప కూలిపోయింది. ఇచ్ఛాపురం సమీపంలో ని బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలింది. బాహుదా నదిపై ఉన్న వంతెన ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. 1929 లో ఈ వంతెనను నిర్మించారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ వంతెన కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
బ్రిటీష్ కాలం నాటి వంతెన...
ఉదయం డెబ్భయి టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెన పైన వెళ్తున్న వాహనాలు కింద పడిపోయాయి. వంతెన శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అయితే వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

