Fri Mar 27 2026 17:10:52 GMT+0530 (India Standard Time)
Srisailam : శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే నిన్న శివభక్తులు చేసిన ఆందోళనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు స్వామి వారి దర్శనం సులువుగా కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు కూడా శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పోలీసులు, దేవస్థానం అధికారుల సమన్వయంతో భక్తులకు దర్శనాలను కల్పిస్తుంది.
కలెక్టర్ అక్కడే ఉండి...
నిన్న శివభక్తుల ఆందోళనతో జిల్లా కలెక్టర్, డీఐజీ రాత్రి అక్కడే ఉండి దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. సాధారణ భక్తులకు, శివ మాల ధరించిన వారికిగా విడతల వారీగా దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులు సులువుగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

