Sun Mar 15 2026 20:01:28 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో నేడు శ్రీవారి సేవలు
తిరుమలలో నేడు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో జు ఉదయం స్వామి వారు సింహ వాహనంలో మాడ వీధుల్లో విహరించారు

తిరుమలలో నేడు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన ఆదివారం ఉదయం స్వామి వారు సింహ వాహనంలో మాడ వీధుల్లో విహరించారు. పెద్దయెత్తున భక్తులు మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు మాడ వీధుల్లో బారులు తీరారు. వాహన సేవను తిలకించేందుకు వేలాది మంది భక్తుల నిరీక్షణ ఫలించింది.
సాయంత్రం ముత్యపు పందిరి ....
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. రాత్రి ఏడు గంటలకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. మాడవీధుల్లో ఉండి చూసిన భక్తులు పులికించిపోయారు.
Next Story

