Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తుంది : మాజీ మంత్రి బొత్స
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహంవ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యంగ బద్దంగా పనిచేస్తుందా అని అనుమానం వస్తుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో చట్టానికి గౌరవం లేన్న బొత్స వెంకటరెడ్డి ని అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి కోర్టులో ప్రవేశపెట్టారని అన్నారు. జడ్జి చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారని, సీఐ సతీష్ పై తీవ్ర వత్తిడి తెచ్చారని, అందుకే ఆత్మ హత్య చేసుకున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ హత్యే అని తాను అంటున్నాను వచ్చి నన్ను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.
అధికారం ఉందని...
అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అన్ని రోజులు ఒకలానే ఉండవని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిపక్షం అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెప్తాం..చెప్తూనే ఉంటామని, స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతగా లేవన్న బొత్స అంత అసహనం ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా శాసనమండలి లో తీర్మానం చెయ్యమంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, మీరెందుకు అలా చెయ్యలేదన్నార. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి అందుకే అడుగుతున్నామని సమాధానం చెప్పాలన్నారు.రాజ్యాంగ బద్ధ పాలన అనుకుంటున్నారా..? తాలిబన్ల పాలన అనుకుంటున్నారా..? అని బొత్స ఫైర్ అయ్యారు.
Next Story

