Sat Feb 07 2026 15:49:24 GMT+0530 (India Standard Time)
కూటమి సర్కార్ పై బొత్స సత్యనారాయణ ఫైర్
జోగి రమేష్ అన్న మాటల్లో తప్పేమిటని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

జోగి రమేష్ అన్న మాటల్లో తప్పేమిటని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చిప్ లేని వారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని అన్నారు. ఇళ్లమీద పడి దాడులు చేయడం ఏంటని బొత్స సత్యనారాయణ నిలదీశారు. దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. దాడులు చేయించుకున్న వారిపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెడతారా? అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలసులు, గూండాలు కలసి దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
కేసులు పెట్టడమేంటి?
ముందు రోజు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి, మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని అన్నారు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి? ఏ సెక్షన్లు పెట్టాలి? అలాగే జనసమీకరణ చేస్తే నాన్ బెయిల్ బుల్ కేసులు పెడతారా? ఇలాంటిది ఎక్కడైనా చూశామా? అని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసులు కూటమి గూండాలకు ఎస్కార్టుగా వస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు.
Next Story

