Tue Apr 07 2026 19:45:42 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఓటమిపై బొత్స హాట్ కామెంట్స్
వైసీపీ ఓటమి పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టెలు మార్చారో.. అర్ధరాత్రి వరకూ ఓటర్లు ఓట్లు వేయడం గెలిచిందో అందరికీ తెలుసునన్నారు. ఈ విషయం దేశ ఆర్థిక మంత్రి భర్త బయట పెట్టారని బొత్స వ్యాఖ్యానించారు.
పెట్టెలు మార్చడం వల్లనే...
ఎన్నికల్లో ఎలా గెలిచారన్నది అందరికీ తెలుసునని, ప్రజా తీర్పును గౌరవించడం అంటే పెట్టెలు మార్చడమేనా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని బొత్స సత్యనారాయణ అన్నారు.
Next Story

