అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే
అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు

అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.ప్రత్యేక హోదా తెస్తే పది అమరావతులు వస్తాయన్నారు. ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థులు అల్లాడుతున్నారన్న బొత్స ప్రజా సమస్యల కంటే చంద్రబాబుకు కాంక్రీట్ పనులపైనే తాపత్రయం ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరావతిలో కాంక్రీట్ వేశామని అనిపించుకోవడానికే చంద్రబాబు ఆరాటపడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను మీడియా పట్టించుకోకపోవడం దారుణమన్న బొత్స ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

