Fri Dec 05 2025 14:58:24 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు భద్రతపై మంత్రి బొత్స వ్యాఖ్యలు విన్నారా?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో చంద్రబాబు నాయుడు భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. చంద్రబాబు భద్రతలో ఏదైనా లోపం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం వెనుక తమ ప్రమేయం లేదని.. వైసీపీ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిందన్న వార్తలను మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టి పారేశారు. స్కిల్ డవలప్మెంట్ స్కాంలో అక్రమాలకు పాల్పడటం వల్లే చంద్రబాబు రిమాండ్ కు వెళ్లారని.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందని అన్నారు.
Next Story

