Mon Jan 20 2025 14:25:59 GMT+0000 (Coordinated Universal Time)
కర్మక్రియల రోజే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంట్లో మరో విషాదం
సాయంత్రం స్నానానికి వెళ్లిన హరినాథ్ రెడ్డి బాత్రుంలో జారిపడ్డారు. గాయపడిన ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు బొజ్జల హరినాథ్ రెడ్డి బుధవారం రాత్రి కన్నుమూశారు. సాయంత్రం స్నానానికి వెళ్లిన హరినాథ్ రెడ్డి బాత్రుంలో జారిపడ్డారు. గాయపడిన ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈనెల 6న కన్నుమూసిన బొజ్జల కర్మక్రియలు ఈరోజు నిర్వహించారు. ఇదేరోజు ఆయన సోదరుడు చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మే 6న బొజ్జల మరణించగా బుధవారం ఆయన కర్మలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వారిని బొజ్జల హరినాథరెడ్డి పలకరించారు. పాల్గొన్న స్థానిక నేతలతో మాట్లాడారు. సాయంత్రం సమయంలో హరినాథ రెడ్డి బాత్రూంలోకి వెళ్లారు. ఎంతసేపటికీ ఆయన గది నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆయన బాత్రూంలో పడిపోయి ఉన్నారు. దీంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు బొజ్జల స్వగ్రామమైన ఊరందూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కర్మక్రియల రోజే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
News Summary - bojjala gopala krishna reddy brother harinath reddy demise slipped in bathroom
Next Story