Sun Mar 08 2026 01:30:05 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీకి సోము వీర్రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఈ నెల 16,17 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరగనుండటంతో రేపు సోము వీర్రాజు ఢిల్లీ వెళుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర మంత్రులను కలసి...
ఇక సోము వీర్రాజు ఈ సందర్భంగా పలువురి కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను గురించి చర్చించే అవకాశముంది. కేంద్రంలోని పెద్దలతోనూ సోము సమావేశమై రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించే అవకాశముందని తెలిసింది.
Next Story

