Sat Dec 06 2025 15:45:21 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సర్కార్ కు సోము వీర్రాజు వార్నింగ్
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కువగా ఉందన్నారు. జగనన్న కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులిస్తే తాము చెప్పిన పేర్లు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రతి పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని పేరు పెట్టకపోతే తాము రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు.
మోదీ పేరును....
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులును వివిధ పథకాల ద్వారా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలకు తమ పేర్లను పెట్టుకోవడంపై సోము వీర్రాజు అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పథకానికి మోదీ పేరు పెట్టాలన్నారు. లేకుంటే తామే పేర్లు పెడతామని, మీ ఇష్టం వచ్చినట్లు పెడితే ఊరుకునేది లేదని సోము వీర్రాజు జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

