Sat Dec 06 2025 04:07:48 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా టిక్కెట్లు కాదు... వాటి ధరలను తగ్గించండి
సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు

సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అనవసరంగా ఈ వివాదాన్ని ప్రభుత్వం కొని తెచ్చుకుందన్నారు. అసలు మూవీ టిక్కెట్ల అంశంపై ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పాలని సోము వీర్రాజు కోరారు. సినిమా టిక్కెట్ల ను తగ్గించడంపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేదని ఆయన ఫైరయ్యారు.
గనుల దోపిడీ....
ప్రజలకు అవసరమైన సిమెంట్, ఇసుక ధరలను ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. వరి ధాన్యాన్ని సరైన మద్దతు కల్పించాలని ఆయన కోరారు. వైఎస్ హయాం నుంచే గనుల దోపిడీ కొనసాగుతుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు పైర్ అయ్యారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

