Fri Mar 27 2026 10:15:10 GMT+0530 (India Standard Time)
అద్దెలు ఎంత పెరిగాయో జగన్ కు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించలేదన్నారు.
రద్దు చేయాల్సిందే....
ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా ఇంటి అద్దెలు పెరిగాయని, మరి హెచ్ఆర్ఏలో కోత విధిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

