Sun Mar 08 2026 01:30:03 GMT+0530 (India Standard Time)
పవన్ తో పొత్తులోనే ఉన్నాం కదా?
పవన్ కల్యాణ్ తో పొత్తులోనే ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు

పవన్ కల్యాణ్ తో పొత్తులోనే ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తమతోనే ఉంటారని అన్నారు. బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు. పవన్ వారాహి యాత్రకు ప్రత్యేకంగా బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజల ప్రాణాలు తీసేలా....
ప్రజల ప్రాణాలు తీసేలా రాజకీయ పార్టీల నేతల ఉండకూడదని తమ అభిప్రాయమని సోము వీర్రాజు తెలిపారు. పవన్ తమతో పొత్తు వద్దనుకుంటే అప్పుడు చూద్దామని ఆయన అన్నారు. ఆయన టీడీపీతో వెళ్లినప్పుడు అప్పుడు ఆలోచిద్దామని అన్నారు. రెండు పార్టీలూ వేర్వేరుగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీలతో పొత్తుకు తాము వ్యతిరేకమని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
Next Story

