Mon Mar 16 2026 06:50:40 GMT+0530 (India Standard Time)
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు
త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాము ప్రజాపోరు కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజాపోరు నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీతో సోము వీర్రాజు వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఐదువేల సభలను నిర్వహించ తలపెట్టామని ఆయన అన్నారు. ప్రజాపోరు సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు సూచించారు.
ప్రజాపోరు ద్వారా....
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా పోరు సభల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోము వీర్రాజు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రజాపోరు సభలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ ఏపీలో ప్రజాపోరు సభలను నిర్వహిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నేతలకు సోము వీర్రాజు సూచించారు.
Next Story

