Fri Mar 27 2026 20:01:49 GMT+0530 (India Standard Time)
అమరావతి రైతుల పోరాట యాత్రలో పాల్గొంటాం
ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ హయాంలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు.ః
మూడు రాజధానులకు వ్యతిరేకం...
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకురావడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ ఖండిస్తుందని చెప్పారు. అన్ని జిల్లాల దళిత మోర్చా నేతలు, పార్టీ కార్యకర్తలు రాజధాని అమరావతి రైతులకు అండగా నిలవాలని సోము వీర్రాజు పిలుపు నిచ్చారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

