Sun Mar 08 2026 04:59:23 GMT+0530 (India Standard Time)
అది మా వల్లనే సాధ్యమయింది
ివిశాఖ రైల్వే జోన్ తమ పార్టీ వల్లనే సాధ్యమయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షఉడు సోము వీర్రాజు అన్నారు

ివిశాఖ రైల్వే జోన్ తమ పార్టీ వల్లనే సాధ్యమయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షఉడు సోము వీర్రాజు అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమయిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో నిధులను విడుదల చేయడంతో పాటు, విభజన హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. విశాఖ వాసుల కల సాకారమయిందని ఆయన అన్నారు.
రాష్ట్రం తన వాటాను....
ఇక కోనసీమ రైల్వే లైను ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడం వల్లనే సాధ్యం కాలేదన్నారు. దీనిపై బీజేపీ ఉద్యమం చేస్తుందని చెప్పారు. కడప - బెంగళూరు రైల్వేలైను పరిస్థిితి కూడా అంతేనని సోము వీర్రాజు తెలిపారు. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తన వాటా చెల్లించేలా ఉద్యమిస్తామని సోము వీర్రాజు తెలిపారు.
Next Story

