Sun Mar 08 2026 01:31:33 GMT+0530 (India Standard Time)
ఆ ఘనత చంద్రబాబుది కాదు.. పీవీది
పొదుపు సంఘాల ఘనత చంద్రబాబుది కాదని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు

పొదుపు సంఘాల ఘనత చంద్రబాబుది కాదని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పొదుపు సంఘాల ఘనత తనదేనని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ మిత్రపక్ష మైన జనసేన ఇళ్ల పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలా చేస్తే బీజేపీ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇరవైఐదు లక్షల ఇళ్లను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జగనన్న కాలనీలకు...
జగనన్న కాలనీలు అనే బదులు మోదీ పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇరవై కోట్టు కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం జగన్ పేరు ఎలా పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడ్డుకుంటుంటే తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. మీడియా కూడా తమకు కవరేజీ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైండ్ గేమ్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు.
Next Story

