Sat Dec 06 2025 15:42:39 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై సోము వీర్రాజు ఘాట్ వ్యాఖ్యలు
తాను పేద వాడిని దృష్టిలో ఉంచుకునే లిక్కర్ గురించి మాట్లాడానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు

తాను పేద వాడిని దృష్టిలో ఉంచుకునే లిక్కర్ గురించి మాట్లాడానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆరు రూపాయల చీప్ లిక్కర్ ను ప్రభుత్వం 200 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. తనను సారాయి వీర్రాజుగా సంబోధించే వ్యక్తులు రోజు ఏం తాగుతారో తనకు తెలుసునని సోము సెటైర్ వేశారు.
తెల్లవారు జాము వరకూ....
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనపై సోషల్ మీడియాలో సెటైర్ వేశారని, కానీ ఆయన తండ్రి తెల్లవారు జామున మూడు గంటల వరకూ ఏం చేస్తారో అందరికీ తెలుసునన్నారు. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తాము ఆందోళనకు దిగుతామని సోము వీర్రాజు హెచ్చరించారు. కింగ్ జార్జి హాస్పిటల్ పేరు కూడా మార్చాలన్నారు. కేజీహెచ్ కు గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాధం ఆసుపత్రిగా మార్చాలన్నారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

