Wed Dec 17 2025 00:02:24 GMT+0000 (Coordinated Universal Time)
షా రెండు నెలలక్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు
అమిత్ షా తమకు రెండు నెలల క్రితమే రోడ్డు మ్యాప్ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు

అమిత్ షా తమకు రెండు నెలల క్రితమే రోడ్డు మ్యాప్ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై తాము పోరాడుతున్నామని చెప్పారు. మా కేంద్ర పార్టీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని సోము వీర్రాజు చెప్పారు. పవన్ కల్యాణ్ మా మిత్ర పక్షానికి అధ్యక్షుడు అని ఆయన అన్నారు.
నావద్ద సమాచారం లేదు....
అయితే టీడీపీతో పొత్తు విషయంపై తన వద్ద ఎటువంటి సమాచారం లేదని సోము వీర్రాజు చెప్పారు. వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ కూడగడితే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టామని సోము వీర్రాజు తెలిపారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

