Fri Mar 27 2026 08:25:36 GMT+0530 (India Standard Time)
వైసీపీకి కాపులంటే ద్వేషం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులంటే ధ్వేషమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులంటే ధ్వేషమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి కాపులకు ఎందుకు కల్పించరు అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలంటేనే ప్రేమ అని ఆయన అన్నారు. అందుకే ఏపీలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. అలాగే కాపులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని సోము వీర్రాజు ప్రశ్నించారు.
అన్ని రకాలుగా సహకరిస్తున్నా....
కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఏపీలోనే 63 వేల కోట్ల రూపాయల వెచ్చించి జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్రం మాత్రం భూమిని అప్పగించడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జరిగే సమావేశంలో కేవలం ఏపీ, తెలంగాణకు చెందిన ఆస్తులపైనే చర్చ జరుగుతుందని చెప్పారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

