Sat Dec 06 2025 16:30:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నీకు దమ్ము, ధైర్యం ఉంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అన్నమయ్య ప్రాజెక్టును గురించి ప్రస్తావిస్తే ఆయననే తప్పుపడతారా? అని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సంఘటనపై న్యాయవిచారణ జరపాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారి నుంచి పరిహారం వసూలు చేయాలని ఆయన కోరారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలవరం చేతకాకపోతే....
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని సోము వీర్రాజు కోరారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంచనాలు పెంచారని జగన్ గతంలో చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కూడా అంచనాలు పెంచమంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

