Sun Feb 01 2026 21:17:30 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి సమస్యను సజీవంగా ఉంచేందుకే?
అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు

అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం అఫడవిట్ ను దాఖలు చేసి రైతుల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఒక షెడ్యూల్ ప్రకారం ఒప్పందంలో భాగంగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని సోము వీర్రాజు కోరారు. రైతులు ఏడాదిన్నర కాలం నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రెండు ప్రభుత్వాలు...
ఇటు తెలుగుదేశం, అటు వైసీపీ ప్రభుత్వాలు అమరావతి రైతులను ముంచేశాయన్నారు. రైతులు తాము ఇచ్చిన భూములకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజధాని రైతుల సమస్యను సజీవంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక షెడ్యూల్ ప్రకారం రాజధాని రైతుల సమస్యను పరిష్కరిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చాు.
Next Story

