Sun Feb 01 2026 04:46:11 GMT+0000 (Coordinated Universal Time)
బొత్స గారూ.. మీరు ఇక్కడ ఏం చేశారు?
ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో బొత్స సత్యనారాయణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు.

ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో బొత్స సత్యనారాయణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. విజయనగరం ప్రజాపోరు సభలో ఆయన మాట్లాడారు. విజయనగరం వీధుల్లో తొలుత పాదయాత్ర చేసిన సోము వీర్రాజు అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. గత మూడేళ్లుగా వైసీపీ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర సాగు జలాల కోసం తాము ఉద్యమం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయని ఆయన అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో....
ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు కారణంగానే అందరం బతికి బట్టకట్టగలిగామన్న విషయాన్ని గుర్తుంచుకోవలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు కేవలం స్టిక్కర్ల ప్రభుత్వాలేనని, ఒక్కసారి బీజేపీికి అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
Next Story

