Thu Dec 18 2025 23:07:45 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ చూస్తే ముందస్తు ఎన్నికలకే?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కన్పిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కన్పిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అప్పుల చేసి మరీ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిసతున్నారని ఆయన అన్నరాు. అప్పుడు చేసిన జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రాంతాల అభివృద్ధి ప్రస్తావన బడ్జెట్ లో లేదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించకపోవడం పట్ల సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
మాదే ప్రభుత్వం...
ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కంటే అప్పుల మీదే ధ్యాస ఎక్కువ అని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు ఐదు వేల కోట్లకు చేరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుల వివరాలను ఈ ప్రభుత్వం బయటపెట్టడం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ తో అందరికీ నిధులు ఇచ్చామని, ఈ బడ్జెట్ లో ప్రాంతాల వారీగా నిధుల వివరాలు ఎందుకు చెప్పలేదని సోము వీర్రాజు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
Next Story

