Mon Feb 02 2026 03:17:56 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు పురంద్రీశ్వరి నామినేషన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీకే సింగ్ హాజరు కానున్నారు. నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తో సహా ముగ్గురు బీజేపీ నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం లోక్ సభ అభ్యర్థి గా నేటి మధ్యాహ్నం 1.30 గం లకు నామినేషన్ దాఖలు చేస్తారు.
జనసేన, టీడీపీ నేతలు...
దగ్గుబాటి పురంద్రీశ్వరి నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ నామినేషన్ కు హాజరుకానున్నారు. రాజమండ్రిలో ర్యాలీగా బయలుదేరి పురంద్రీశ్వరి మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

