Thu Apr 02 2026 20:22:31 GMT+0530 (India Standard Time)
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు
చంద్రబాబు పై ఉన్న కోపంతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు పై ఉన్న కోపంతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. 2024లో జగన్ కు ప్రజలు పెద్ద షాక్ ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. ఇష్టారాజ్యంగా కరెంటు ఛార్జిలు పెంచితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, బ్యాలట్ ద్వారా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేసుకునే పరిస్థితి లేకుండా ఉందని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ.....
ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ప్రదేశ్ గా, అంధకార ప్రదేశ్ గా జగన్ మార్చేశారని ఆయన అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై పన్నులు భారం మోపుతున్నారన్నారని భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ముందు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వస్తే జగన్ ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమవుతుందని అన్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై బీజేపీ ఖచ్చితంగా ప్రజలతో కలసి పోరాటం చేస్తుందని తెలిపారు.
Next Story

