Thu Mar 19 2026 22:28:23 GMT+0530 (India Standard Time)
ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావడం ఖాయమని అన్నారు. ఏపీలోనూ కూటమి విజయం తధ్యమని అన్నారు.
రిజర్వేషన్లపై...
రిజర్వేషన్లు రద్దు చేేస్తారంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రజల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తుందని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని లక్ష్మణ్ కోరారు. బీసీలను జగన్ బానిసలుగా చేశారన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. బీజేపీ పై చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దంటూ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
Next Story

