Sat Dec 06 2025 01:52:44 GMT+0000 (Coordinated Universal Time)
కాపులకు రిజర్వేషన్ల పై రాజ్యసభలో...?
రాజ్యసభలో కాపుల రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లేవనెత్తారు.

రాజ్యసభలో కాపుల రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లేవనెత్తారు. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని జీవీఎల్ నరసింహారావు కోరారు. గత ప్రభుత్వం దీనిని ప్రవేశ పెట్టినా ప్రస్తుత ప్రభుత్వం దీనిని అమలు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
అన్ని రంగాల్లో....
ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపులు 18 శఆతం ఉన్నారని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వీరు వెనకబడి ఉన్నారన్నారు. వీరికి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కాపులకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీరో అవర్ లో ఆయన కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు.
Next Story

