Thu Mar 19 2026 01:42:38 GMT+0530 (India Standard Time)
జీవీఎల్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధి పై వైసీపీకి చిత్తశుద్ధి లేదని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన జీవీఎల్ పై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. " అయ్యా అబద్దాల నరసింహా 2019 ఎన్నికల్లో మేము 22 మంది లోక్ సభ సభ్యుల్ని గెలిపించుకోవడం వల్ల మీరు ఏపీకి న్యాయం చేయడం లేదా? లేక మీ పార్టీకి 301 సీట్లు రావడం వల్ల న్యాయం చేయడం లేదా? అని ప్రశ్నించారు.
ఎన్నిరకాలుగా....
రాష్ట్రం కోసం కేంద్రాన్ని అన్నిరకాలుగా సాయం కోసం అభ్యర్థిస్తున్నామని, మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ గా ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పడం మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.
Next Story

