Fri Dec 05 2025 23:16:05 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తులపై జీవీఎల్ ఏమన్నారంటే?
పొత్తులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు

పొత్తులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కలుపుకుని పోదామని పవన్ కల్యాణ్ ప్రతిపాదన తెచ్చారని తెలిపారు. పవన్ ప్రతిపాదనను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తాము ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు. స్థానికంగా పొత్తుల నిర్ణయాలు ఉండవని ఆయన తెలిపారు.
పవన్ మాత్రం....
అయితే పొత్తులపై అంతిమ నిర్ణయం తీసుకునేది కేంద్ర నాయకత్వం మాత్రమేనని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీని ఓడించవచ్చని గట్టిగా భావిస్తున్నారని, ఆ దిశగానే పొత్తులు ఉంటే మంచిదని చెబుతున్నారని తెలిపారు. అయితే తాము దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, కేంద్ర నాయకత్వం చెప్పినట్లు తాము నడుచుకుంటామని తెలిపారు.
Next Story

