Fri Sep 13 2024 08:18:56 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో అంతర్గత పోరు.. సీఎం రమేష్ సంచలన కామెంట్స్
వైసీపీలో అంతర్గత పోరు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు
వైసీపీలో అంతర్గత పోరు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నుంచి కార్యకర్త వరకూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఇక వైసీపీకి గడ్డు రోజులేనని సీఎం రమేష్ అన్నారు. బీజేపీ అంటేనే వైసీపీ, టీడీపీ లు భయపడతున్నాయని సీఎం రమేష్ తెలిపారు.
టీడీపీ కూడా ఫెయిల్....
పేర్ని నాని తమ పార్టీని విమర్శించే ముందు వైసీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరారు. అలాగే పయ్యావుల కేశవ్ కూడా ప్రతిపక్షంగా టీడీపీ విఫలమయిందని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉందన్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Next Story