Sun Mar 15 2026 07:56:59 GMT+0530 (India Standard Time)
మరోసారి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ పోలీసులను రీకాల్ చేస్తారని ఆయన అన్నారు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ పోలీసులను రీకాల్ చేస్తారని ఆయన అన్నారు. మోదీ పర్యటనలో భద్రత వైఫల్యానికి నిరసనగా బీజేపీ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఏపీ పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ కండువాలు కప్పుకుని మరీ విధులు నిర్వహిస్తున్నారన్నారు.
త్వరలోనే రీకాల్.....
గతంలో తాను ఏపీ పోలీసులు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సీఎం రమేష్ తెలిపారు. వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయిందన్నారు. త్వరలోనే ఏపీ పోలీసులను రీకాల్ చేస్తారని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఇక్కడ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం చక్కదిద్దుతుందని సీఎం రమేష్ పేర్కొన్నారు.
Next Story

