Fri Dec 05 2025 16:01:47 GMT+0000 (Coordinated Universal Time)
సోము సారాయి దుకాణాల సంఘం అధ్యక్షుడా?
తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామనిసోము వీర్రాజు ప్రకటన పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోము వీర్రాజు సారాయి సంఘానికి అధ్యక్షుడా అని ఎక్సౌజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలను తగ్గిస్తామని చెప్పడం ఆ పార్టీ జాతీయ పాలసీయా? అని నారాయణస్వామి ప్రశ్నించారు.
ఎన్ని అడ్డదారులైనా...?
జాతీయ పాలసీ అయితే అన్ని రాష్ట్రాల్లో అదే విధానాన్ని కొనసాగించాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎదగడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందనడానికి సోము వ్యాఖ్యలే ఉదాహరణ అని నారాయణస్వామి అన్నారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా కాకుండా సారాయి దుకాణాల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరపించారు.
Next Story

