Fri Dec 05 2025 15:44:16 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తులపై సునీల్ దేవధర్ ఏమన్నారంటే?
కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ అన్నారు

కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ అన్నారు. కుటుంబ వారసత్వ పార్టీలతో కలసే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తమ పార్టీకి కేవలం జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ జనసేనతోనే కలసి ప్రయాణం చేస్తామని ఆయన తెలిపారు. కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
కుటుంబ రాజకీయాలకు...
కుటుంబ రాజకీయాలు అంటే దేశానికి నష్టం చేకూర్చేవేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో కుటుంబ పార్టీల వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పొత్తులను కుటుంబ పార్టీల అనుకూల మీడియాలు నిర్ణయించలేవన్నారు. ప్రస్తుతం తాము తెలుగుదేశం పార్టీ, వైసీపీలకు సమాన దూరం పాటిస్తున్నామని సునీల్ దేవ్‌ధర్ తెలిపారు.
Next Story

