Fri Dec 05 2025 19:41:27 GMT+0000 (Coordinated Universal Time)
Sujana Choudhary : కూటమి ప్రభుత్వంపై సుజనా చౌదరి విసుర్లు
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ పాలనలానే నడుస్తుందని అన్నారు. ప్రధానంగా అసెంబ్లీలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అమరావతి రైతుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. తాను గత పదేళ్ల నుంచి అమరావతి రైతుల సమస్యలను దగ్గరుండి చూశానని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతున్నా వారి సమస్యలను పరిష్కరించలేదన్నారు.
అమరావతి రైతులు...
అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేశామని, అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నప్పటికీ దానిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తూ నాటి పాలన తరహానే కొనసాగిస్తున్నారని అర్థమవుతుందన్నారు. అమరావతి రైతుల సమస్యపై తాను సభలో చర్చ జరగాలని కోరితే దానిని ఎవరూ పట్టించుకోకపోవడంపై కూడా సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story

