Tue Dec 16 2025 23:50:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయమయింది. లండన్ పర్యటనలో భాగంగా అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో కింద పడిపోయారు

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయమయింది. విజయవాడ పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి లండన్ పర్యటనకు వెళ్లారు. అయితే లండన్ పర్యటనలో భాగంగా అక్కడ ఒక సూపర్ మార్కెట్ కు సుజనా చౌదరి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు.
కుడి భుజం ఎముక...
ఈ ఘటనలో సుజనా చౌదరి కుడి భుజం ఎముక విరగిందని వైద్యులు తెలిపారు. అయితే ఆయనను వెంటనే లండన్ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భుజం ఎముక విరగడంతో సుజనా చౌదరి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
Next Story

