Sun Mar 15 2026 20:37:25 GMT+0530 (India Standard Time)
BJP : వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయం
వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు

వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బెంగళూరులో ఉన్న జగన్ అక్కడి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ తో భేటీ అయి చర్చించారని ఆయన తెలిపారు. ఏ క్షణమైనా వైసీపీని కాంగ్రెస్ లో జగన్ విలీనం చేస్తారని ఆయన తెలిపారు.
అరాచకం చూసిన ప్రజలు...
వైసీపీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమెర్జెన్సీ కొనసాగిందని అన్నారు. ప్రజలు ఆ ప్రభుత్వం పట్ల విసుగు చెంది కూటమికి ప్రజలు వన్ సైడ్ గా పట్టం కట్టారని తెలిపారరు. నియంతపాలనను ప్రజలు ఆమోదించరన్న విసయం మరోసారి స్పష్టమయిదని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు.
Next Story

