Mon Jan 20 2025 08:45:35 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఏపీకి ఇద్దరు బీజేపీ ఇన్ఛార్జులు.. నియమించిన హైకమాండ్
అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాధ్ లను ఏపీ ఎన్నికల ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు ఇన్ఛార్జులను నియమించింది. అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాధ్ లను ఏపీ ఎన్నికల ఇన్ఛార్జులుగా నియమిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో ఇద్దరు ఇన్ఛార్జులను నియమిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఎన్నికల బాధ్యతను...
వీరిద్దరూ ఏపీ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. ఏపీలో కూటమి ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీలతో సత్సంబంధాలు నెరుపుతూ ప్రచారం నిర్వహించడంపై వీరు దృష్టి పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు లోక్సభ ఎన్నికలు జరిగే రాజస్థాన్, హర్యానాలకు కూడా ఇన్ఛార్జులను అధినాయకత్వం నియమించింది.
Next Story