Fri Mar 27 2026 10:15:10 GMT+0530 (India Standard Time)
తప్పుడు కేసులు పెడుతున్నారు.. అనుభవిస్తారు
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు అన్నారు

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. తమ పార్టీకి చెందిన నేత శ్రీకాంత్ రెడ్డి వాహనం ధ్వంసమయినా ఆయనపైనే తిరిగి కేసు నమోదు చేశారన్నారు.
మూల్యం చెల్లించుకుంటారు...
వైసీపీ ప్రభుత్వానికి క్యాసినో కల్చర్ అంటే బాగా ఇష్టం లాగుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. క్యాసినో మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారన్నారు. పోలీసులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని, కేంద్ర ప్రభుత్వం దీనిపై సీిరయస్ గా ఉందని సీఎం రమేష్ అన్నారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

