Sat Mar 07 2026 17:43:31 GMT+0530 (India Standard Time)
AP BJP : అభ్యర్థిని మార్చాల్సిందే.. హైకమాండ్ కు నేతల అల్టిమేటం
ఎచ్చెర్లలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అభ్యర్థి ఈశ్వరరావును ప్రకటించడంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.

ఎచ్చెర్లలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యర్థిగా ఈశ్వరరావును ప్రకటించడంపై స్థానిక బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. బీసీలకు ఇవ్వకుండా ఓసీలకు ఎచ్చెర్ల టిక్కెట్ ను ఎలా ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అసంతృప్త నేతలందరూ ఒక చోట సమావేశమై అధినాయకత్వంపై వత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు.
మార్చకపోతే...
ఎచ్చెర్లలో ఓసీ అభ్యర్థి ఈశ్వరరావును మార్చి బీసీ అభ్యర్థిని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పార్టీకి వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకుంటామని, తమ దారి తాము చూసుకుంటామని పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం జారీ చేశారు. తాము ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమంటూ వారు ఏకంగా తీర్మానం చేశారు. మరి దీనికి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

